సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్రయూనిట్ జూలై 12న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను మొదలు పెట్టింది. తాజాగా మహేశ్ అభిమానులకు చిత్ర యూనిట్ క్రేజీ అప్‌డేట్‌ను అందించింది. సర్కారు వారి పాట సినిమా నుంచి మహేశ్ బాబు ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో మహేశ్‌ను చూస్తారని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
ఇందులో మహేశ్ తన చేతిలో ఓ బ్యాగ్‌ను పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది. అతనితోపాటు పోస్టర్‌లో కొన్ని కార్లు, బైకులు, రౌడీలు కూడా కనిపిస్తున్నారు. పోస్టర్‌లోని ప్రిన్స్ లుక్ అందరిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మహేశ్ మూవీ నుంచి అప్‌డేట్ రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతేగాక ఇప్పుడే ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మరి మహేశ్ బర్త్‌డేకి (ఆగష్టు 9) అభిమానులను ఏ విధంగా సర్‌ప్రైజ్ చేస్తాడోనని ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
Witness our SuperStar in never seen before avatar 💥#SVPFirstNotice on July 31st 🔔#SarkaruVaariPaata
— Mythri Movie Makers (@MythriOfficial) July 29, 2021
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @SVPTheFilm pic.twitter.com/fwEEZv8AnY
Comments
Please login to add a commentAdd a comment