సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న `సర్కారువారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్ వచ్చేసింది. రెడ్ కలర్ కారులో నుంచి మహేశ్ బయటకు దిగుతున్నట్టుగా ఉన్న మాస్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ లుక్ ఫైట్ సీన్‌కి సంబంధించినది అని కారు అద్దాలు పగిలిన విధానాన్ని బట్టి అర్థమవుతోంది. ఇందులో మహేశ్ పొడవాటి చుట్టుతో, కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రీట్ కూడా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న `సూపర్‌స్టార్ బర్త్ డే బ్లాస్టర్` పేరుతో మరో గిఫ్ట్ ఇవ్వనున్నారు. బ్యాంకు కుంభకోణం నేపథ్‌యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Taking off on this whole new journey of action and entertainment! Join us this Sankranthi! :) #SVPFirstNotice @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata pic.twitter.com/so7pWW1ShP
— Mahesh Babu (@urstrulyMahesh) July 31, 2021
Comments
Please login to add a commentAdd a comment