చిరంజీవి రెండుసార్లు అడిగినా నో చెప్పిన హీరో.. ఎవరంటే? | Malayalam Famous Actor Rejected Chiranjeevi Two Films Including Sye Raa Narasimha Reddy And Godfather | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్‌ నోరు తెరిచి అడిగినా పట్టించుకోని హీరో.. రెండుసార్లు రిజెక్ట్‌!

Published Fri, Mar 22 2024 7:20 PM | Last Updated on Sat, Mar 23 2024 2:51 PM

Malayalam Famous Actor Rejected Chiranjeevi Two Films Including Sye Raa Narasimha Reddy And Godfather - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో ఛాన్స్‌ దొరికితే ఎవరైనా కాదంటారా? కానీ ఓ హీరో మాత్రం నిర్మొహమాటంగా చేయనని చెప్పాడట! మెగాస్టార్‌ నోరు తెరిచి రెండోసారి అడిగినా కూడా వీలు కాదని తిరస్కరించాడట! ఇంతకీ ఆ హీరో కమ్‌ విలన్‌ ఎవరనుకుంటున్నారా? మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ప్రస్తుతం ఈయన ఆడుజీవితం(ద గోట్‌ లైఫ్‌) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 28న రిలీజ్‌ కానుంది.

చిరంజీవి సినిమా ఆఫర్‌ చేస్తే
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు పృథ్వీరాజ్‌. ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి సర్‌ సైరా, గాడ్‌ ఫాదర్‌ సినిమాల్లో నన్ను చేయమని అడిగారు. కానీ బిజీగా ఉండటంతో ఒప్పుకోలేకపోయాను. నేను అబద్ధం చెప్తున్నానని ఆయన అనుకుని ఉండొచ్చు. 2017-18 సమయంలో చిరంజీవి సర్‌.. సుహాసిని మేడమ్‌ ద్వారా నాకు సైరా మూవీలో ఓ రోల్‌ ఆఫర్‌ చేశారు. మెగాస్టార్‌ నా గురించి ఆలోచించడమే నాకు పెద్ద సర్టిఫికెట్‌.

సేమ్‌ స్టోరీ చెప్తున్నా..
అప్పుడు ఈ మూవీ కోసమే ప్రిపేర్ అవుతున్నానని, అందుకే నటించలేకపోతున్నా అని ఆయనకు వివరించాను. ఆ తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ చిత్రాన్ని నన్నే డైరెక్టర్ చేయమన్నారు. అప్పడు కూడా గోట్ లైఫ్ సినిమా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అదే మాట చెప్పడంతో చిరంజీవి గారు.. నాలుగేళ్లుగా నువ్వు సేమ్ స్టోరీ చెబుతున్నావ్ అన్నారు. మీ సినిమాలో నటించడం నాకెంతో ఇష్టం సార్ కానీ కుదరడం లేదు అని వినయంగా చెప్పాను. ఆ తర్వాత చిరంజీవి గారు రెగ్యులర్ గా మెసేజ్లు పంపుతూ ఉండేవారు. గాడ్ ఫాదర్ రిలీజ్ రోజున కూడా మెసేజ్ పంపారు. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవి గారితో కలిసి పనిచేస్తాను' అని పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఏడేళ్లు ప్రయత్నించా.. ఇక నేను బిడ్డను కనలేను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement