
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)
2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్‌కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్‌తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.
ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)
#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T
— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024