
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్‌పై ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాకు వ్యాక్సిన్ రాలేదు... అసలు వ్యాక్సిన్ రాదు’ అని అన్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ‘సెహరీ’ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆయన సోమవారం లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. కరోనా మన జీవితాంతం ఉంటుంది. దాంతో మనం సహ జీవనం చేయాల్సిందే. ఇవాళ నుండి కార్తీక సోమవారం. అయిన సరే తల స్నానాలు చేయవద్దు’ అని ఆయన సూచించారు. కాగా కరోనా కట్టడికి పలు దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ మూడవ దశ మానవ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకొని ప్రపంచం ముంగిట్లోకి రానున్నది. (త్వరలో ఫైజర్ కరోనా టీకా సరఫరా )
Comments
Please login to add a commentAdd a comment