
శ్రీరంగం ఆలయంలో నయనతార, విఘ్నేశ్
కోలీవుడ్‌లో నటి నయనతార, దర్శకుడు వఘ్నేష్ శివన్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లెప్పుడు అన్న విషయంపై మీడియా ఇప్పటికే చాలా కథనాలు అల్లేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నయనతార విఘ్నేష్ శివన్ పళ్లి పీటలు ఎక్కడానికి సమయం ఆసన్నమైంది. జూన్9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారు. అంతకు ముందు పలు గుళ్లు గోపురాలు చుట్టేస్తుండటం విశేషం.
ఇటీవల తిరుపతికి వెళ్లి ఏడు కొండలస్వామిని దర్శించుకున్న ఈ జంట సోమవారం తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుని సేవించుకుంది. అనంతరం తంజావూరు జిల్లా అయ్యంపేట సమీపంలోని పళత్తూర్ గ్రామానికి వెళ్లిన దర్శకుడు విఘ్నేష్ శివన్ కులదైవం కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి పాలు పొంగించి విశేష పూజలు చేశారు.