ఓటీటీలోకి వచ్చేసిన సూపర్‌హిట్ దెయ్యం సినిమా | The Nun 2 Movie OTT Streaming Details - Sakshi
Sakshi News home page

OTT New Movie: ఆ ఓటీటీలో దెయ్యం సినిమా.. తెలుగులోనూ ఉంది!

Published Fri, Oct 20 2023 7:14 PM | Last Updated on Fri, Oct 20 2023 8:37 PM

The Nun 2 Movie Ott Streaming Details - Sakshi

మళ్లీ వీకెండ్ వచ్చేసింది. తాజాగా థియేటర్లలో రిలీజైన 'లియో', 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు' ప్రేక్షకుల అంచనాల‍్ని అందుకోలేకపోయాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. సోమవారం వరకు ఆగితే కరెక్ట్ రిజల్ట్ ఏంటనేది తెలిసిపోతుంది. ఇలాంటి టైంలో ఓటీటీలో కొన్ని మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ సూపర్‌హిట్ దెయ్యం సినిమా స్ట్రీమింగ్ అయిపోతుంది.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్)

ఏంటా సినిమా?
సాధారణంగా హారర్ సినిమాలు తీయడంలో హాలీవుడ్ డైరెక్టర్లు ప్రత్యేకం. పెద్దగా కథ లేకపోయినా ఉన్నంతలో సీన్లతో భయపెట్టేస్తుంటారు. అలా 2018లో సింపుల్ కాన్సెప్ట్‌తో తీసిన 'ద నన్' అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. దీనికి కొనసాగింపుగా 'ద నన్ 2' తీశారు. సెప్టెంబరులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. ఇప్పుడు ఇదే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు భాషలోనూ
మైకేల్ చేవ్స్ దర్శకత్వం వహించిన హారర్ మూవీ 'ద నన్'.. దేవత లాంటి ఓ యువతి దెయ్యంగా ఎలా మారింది అనే కథతో తీశారు. సిస్టర్ ఇరేనే అనే ప్రధానపాత్రలో టైస్సా ఫార్మి యాక్ట్ చేసింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, హారర్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రస్తుతం రెంట్ విధానంలో ఉంది కానీ త్వరలో ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పిస్తారు.

(ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement