
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆయన ఇమేజ్ కూడా ఒక్కసారిగా అందనంత ఎత్తుకు వెళ్లింది. ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమాలు చేసినా అవి పలు భాషాల్లోకి డబ్బింగ్ అవుతున్నాయి. అక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. బాహుబాలి తరువాత ప్రభాస్ చేసిన సాహో సినిమా ఆశించినంత స్థాయిలో హిట్ కాలేకపోయినా, వసూళ్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌గా ప్రభాస్‌కు 100 కోట్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఇచ్చేది రూ. 70 కోట్లు కాగా, డబ్బింగ్ రైట్స్ కోసం మరో రూ. 30 కోట్లు ప్రభాస్‌కు ఇవ్వనున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంది ఇప్పటి వరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రమే. ఆయన దర్బార్ సినిమాకు రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ ఆయనను మించిపోయాడు. దీంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించనున్నారు. ప్రభాస్ తాజా సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. చదవండి: దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment