Director Prem Kumar To Direct Vijay Sethupathi One More Time - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: 96 మూవీ కాంబో రిపీట్‌

Published Mon, Aug 30 2021 9:35 AM | Last Updated on Mon, Aug 30 2021 12:08 PM

Prem Kumar Directs Vijay Sethupathi One More Time - Sakshi

'96' చిత్ర కాంబో రిపీట్‌ కానుందని సమాచారం. నటుడు విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన విజయవంతమైన చిత్రం 96ను అంత ఈజీగా ఎవరు మరచిపోలేరు. ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు ప్రేమ్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. చాలా గ్యాప్‌ తరువాత నటి త్రిష జీవితంలో మంచి జోష్‌ నింపిన చిత్రం ఇది. ఇక నటుడు విజయ్‌ సేతుపతి వీర ప్రేమికుడిగా చూపించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. కాగా దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ మరోసారి విజయ్‌సేతుపతిని డైరక్ట్‌ చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement