
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఈ మధ్య తరచూ చేదు సంఘటనలు ఎదురవుతున్నాయి. ఆ మధ్య ఆస్కార్ నామినేషన్లను ప్రకటించే అర్హత ప్రియాంక దంపతులకు లేదని ఓ సినీ ప్రముఖుడు బాహాటంగానే విమర్శించగా తాజాగా ఓ కమెడియన్ ప్రియాంకను రచయిత దీపక్ చోప్రా కూతురిగా సంబోధించింది. ఒక రెస్టారెంట్‌లో నిక్ దంపతులను కలిసిన రోజీయో డానెల్.. ప్రియాంకను దీపక్ చోప్రా కూతురిగా పొరపాటుపడింది. అయితే అది తప్పని తెలుసుకున్న ఆమె వెంటనే ప్రియాంకకు సారీ చెప్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. కాకపోతే ఇందులో కూడా ఫలానా వ్యక్తి భార్య అంటూ తన గురించి ప్రస్తావించడం ప్రియాంకకు ఏమాత్రం నచ్చలేదు.
'మీరు పబ్లిక్‌గా సారీ చెప్పాలనుకున్నప్పుడు నేనెవరో, నా వివరాలేంటో గూగుల్ చేసి తెలుసుకుంటే బాగుండేది. అంతేతప్ప చోప్రా భార్య, సమ్‌థింగ్ చోప్రా అని అనడం కరెక్ట్ కాదు. ఇంతకుముందే చెప్పాను.. చోప్రా అని పేరున్న అందరూ దీపక్ చోప్రా బంధువులైపోరు, స్మిత్ అని పేరున్నంత మాత్రాన విల్ స్మిత్‌కు సన్నిహితులవలేరు అని!' అని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా.
Comments
Please login to add a commentAdd a comment