రేపు ‘పుష్ప’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ | Pushpa Movie: Rashmila Mandanna First Look Out On September 29th | Sakshi
Sakshi News home page

Pushpa Movie: రేపు హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌కు ముహుర్తం ఖారారు

Sep 28 2021 8:22 PM | Updated on Sep 28 2021 8:22 PM

Pushpa Movie: Rashmila Mandanna First Look Out On September 29th - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఫస్ట్‌ పార్ట్‌ విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో రేపు పుష్మ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీలోని అల్లు అర్జున్‌, విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ లుక్‌లు విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అయితే హీరోయిన్‌ రష్మిక మందన్నా లుక్‌ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. దీంతో ఫ్యాన్స్‌ హీరోయిన్‌ లుక్‌ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌కు ముహుర్తం ఖారారు చేసినట్లు తాజాగా మేకర్స్‌ వెల్లడించారు. రేపు(సెప్టెంబర్‌ 29)న ఉదయం 9:45 గంటలకు రష్మిక ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా మూవీ యూనిట్‌ ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement