రాజమహేంద్రవరంలో.... ‘గేమ్‌ చేంజర్‌’ | Ram Charan off to Rajahmundry for Game Changer Final Schedule | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరంలో.... ‘గేమ్‌ చేంజర్‌’

Published Sat, Jun 8 2024 6:06 AM | Last Updated on Sat, Jun 8 2024 6:13 AM

Ram Charan off to Rajahmundry for Game Changer Final Schedule

రాజమహేంద్రవరం పయనమయ్యారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ‘గేమ్‌ చేంజర్‌’ అనే పోలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్‌ చంద్ర, ఎస్‌జే సూర్య ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.

తండ్రి పాత్రలో అప్పన్నగా, కొడుకు పాత్రలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ రామ్‌నందన్‌గా రామ్‌చరణ్‌ కనిపిస్తారట. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణలో పాల్గొనేందుకు శుక్రవారం రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ షెడ్యూల్‌తో ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ఇక రామ్‌చరణ్, అంజలి, శ్రీకాంత్‌తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలిసింది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement