'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ సెట్స్ మీదే ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు 'భారతీయుడు 2' తీయాలనుకోవడం వల్ల మొదటికే మోసం వచ్చి పడింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్-శంకర్ మూవీపై సందేహాలు తలెత్తాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సముదాయించుకుంటున్నారు.
(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)
ఇకపోతే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్నా సరే చాలా ఓపిగ్గా చేస్తూ వచ్చిన రామ్ చరణ్.. ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట.
పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళి లేదా క్రిస్మస్‌కి 'గేమ్ ఛేంజర్'.. థియేటర్లలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే గానీ దీనిపై క్లారిటీ వచ్చేలా లేదు.
(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. ఆయనకు తప్ప అందరికీ నష్టమే!)
Comments
Please login to add a commentAdd a comment