'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ! | Ram Gopal Varma File a Complaint Against Kolikapudi Srinivasa Rao, Anchor Sambasiva Rao | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: 'తల నరికితే రూ.కోటి'.. గట్టిగా బుద్ధి చెప్పనున్న వర్మ!

Published Wed, Dec 27 2023 1:30 PM | Last Updated on Wed, Dec 27 2023 5:04 PM

Ram Gopal Varma File a Complaint Against Kolikapudi Srinivasa Rao, Anchor Sambasiva Rao - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీసిన తాజా చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 29న విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మూవీని ఆపేందుకు ఎంతోమంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రామ్‌గోపాల్‌ వర్మ తల నరికి తెచ్చినవారికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. ఆర్జీవీ- పరాన్నజీవి పేరుతో ఓ ఛానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పై వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా ఆర్జీవీ తనదైన స్టైల్‌లో స్పందించాడు. 'కొలికపూడి నన్ను చంపించేందుకు కాంట్రాక్ట్‌ ఇచ్చాడు. యాంకర్ సాంబశివరావు అతడికి తెలివిగా సాయం చేశాడు. తన హత్యకు సంబంధించి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను 3 సార్లు పునరావృతం చేసేలా వ్యవహరించాడు' అని ట్వీట్‌ చేశారు. 

అలాగే మరో ట్వీట్‌లో కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు యాంకర్‌ సాంబశివరావు, సదరు ఛానెల్‌ యజమాని బిఆర్‌ నాయుడు పై ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు. చివరకు అన్నంత పని చేశాడు వర్మ. నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం విజయవాడలోని డీజీపీ ఆఫీసుకు వెళ్లాడు. కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

చదవండి: పృథ్వీరాజ్‌ చిన్నప్పటి క్యారెక్టర్‌ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్‌పై క్లారిటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement