Ram Gopal Varma's Mother Suryavati About His Childhood - Sakshi
Sakshi News home page

RGV Mother: రాము పరీక్షల్లో ఏం చేశాడంటే.. ఆర్జీవీ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Mar 15 2023 3:50 PM | Last Updated on Wed, Mar 15 2023 4:30 PM

Ram Gopal Varma Mother Suryavati About RGV Childhood in Latest Interview - Sakshi

కాంట్రవర్సీకీ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే వర్మ బాల్యంలో ఎలా ఉండేవాడో తెలుసుకనేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా చూపిస్తుంటారు. తాజాగా ఆర్జీవీ బాల్యం గురించి ఆయన తల్లి సూర్యవతి పలు షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. ఇటీవల తన తల్లి సూర్యవతితో కలిసి ఆర్జీవీ ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ చిన్నప్పటి నుంచి చాలా మేధావి.

చదవండి: 'పసివాడి ప్రాణం' చిత్రంలోని చిన్నోడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?

ఇప్పుడు ఎలా ఉన్నాడో.. చిన్నప్పుడు కూడా అలానే ఉండేవాడు. మూడేళ్ల వయసులోనే తనకు ఏబీసీడీలు, వారాలు(సండే, మండే) చెబితే ఆ తర్వాత రోజే అన్ని అప్పజెప్పేవాడు. అప్పటికి స్కూల్లో చేరలేదు. నేను షాక్‌ అయ్యేదాన్ని. ఏకసంతా గ్రహి. అలాంటి వర్మ స్కూల్‌కు వెళ్లనని మారాం చేసేవాడు. కానీ స్కూల్‌ యూనిఫాం కొనిపెట్టగానే ఏం మాట్లాడకుండ స్కూల్‌కి వెళ్లిపోయేవాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘స్కూల్‌కి వెళ్లి వచ్చాక టీచర్‌ నచ్చలేదనేవాడు. అలా అని ట్యూషన్‌ పెట్టిస్తే మాస్టర్‌కు ఏం రావట్లేదు అని చెప్పేవాడు. నాకు కోపం వచ్చి కొట్టేదాన్ని. ఇక స్కూల్లో ఎగ్జామ్స్‌లో ఒక్కోసారి వందకు తొంభైలు వచ్చేవి. కొన్నిసార్లు ముప్పైలు, నలభైలు వచ్చేవి.

చదవండి: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘దసరా’ ట్రైలర్‌, ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌

అదేంటి ఇలా వచ్చాయి.. ఆన్సర్లు రాలేదా? అని అడిగితే.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చు కానీ, రాయలి అనిపించలేదు’ అని అనేవాడు’’ అని ఆమె అన్నారు. ఆ తర్వాత ఇంత మేధావి అయిన రాము గురించి ఓ విషయంలో ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఇంత మేధావి అయిన రాముకు అసలు పెళ్లి సూట్‌ అవ్వదని ఎందుకు తెలియలేదా? అనిపిస్తోందన్నారు. రత్న(ఆర్జీవి మాజీ భార్య) మాత్రమే కాదు ఏ అమ్మాయి అయినా ఆర్జీవీకి సెట్‌ అవ్వరని ఆమె పేర్కొన్నారు. అనంతరం చిన్నప్పుడు తనని చాలా అందంగా ఉన్నావంటవనేవాడన్నారు. ‘నా స్నేహితుల్లో అందరి అమ్మల కంటే నువ్వే అందంగా ఉంటావు’ అంటూ తరచూ చెప్పేవాడన్నారు. చెప్పాలంటే రాము ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ తానే అంటూ ఆమె సరదగా నవ్వుతూ చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement