Ram Gopal Varma Reaction To Controversial Tweet On Draupadi Murmu, Details Inside - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్‌, స్పందించిన వర్మ

Jun 24 2022 4:39 PM | Updated on Jun 24 2022 5:11 PM

Ram Gopal Varma Reacts On Controversy Over Indecent Tweet On Draupadi Murmu - Sakshi

తరచూ వివాదాల్లో నానుతూ ఉండే రామ్‌గోపాల్‌ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడు. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు? అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ జూన్‌ 22న ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ద్రౌపది ముర్మును కించపరిచేలా ట్వీట్‌ చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

తాజాగా ఈ పరిణామాలపై ఆర్జీవీ స్పందించాడు. మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకెంతో ఇష్టమని తెలిపాడు. ఆ క్యారెక్టర్‌ను గుర్తు చేయాలనే ట్వీట్‌ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేతప్ప ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశాడు. వ్యంగ్యంగా పోల్చడానికి ట్వీట్ చేశానే తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు.

చదవండి: రణ్‌బీర్‌ కపూర్‌ కారుకు యాక్సిడెంట్‌
ఈ సినిమాలో నటించిన సూర్య, షారుక్‌లు ఒక్క పైసా తీసుకోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement