టాలీవుడ్‌లో రామ్‌చరణ్, అల్లు అర్జున్.. మేమంతా ఒకరి సినిమాలు మరొకం చూస్తా.. బాగుంటే మెచ్చుకుంటాం, బాలేకపోతే విమర్శిస్తాం.. అంతే తప్ప మా మధ్య పోటీ అనేదే లేదు అంటున్నాడు రానా దగ్గుబాటి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. మేమందరం ఒకటే పోటీలో లేము. ఎవరికి వారు వేర్వేరు దారుల్లో ఉన్నాం. ఎవరి పోటీ వారిదే! ఒక్కొక్కరు ఒక్కోరకమైన కాన్సెప్ట్ ఎంచుకుంటారు. ఆ సినిమాలతో విజయం సాధిస్తారు.
మీకు కనిపించేవి కలెక్షన్స్ మాత్రమే!
అలాంటప్పుడు దేని గురించి మేమంతా పోటీపడతాం? బాక్సాఫీస్ లెక్కల కోసమా? కలెక్షన్స్ మాత్రమే మీకు డైరెక్ట్‌గా కనిపిస్తాయి. కానీ కేవలం నెంబర్స్ కోసమే మేము పని చేయడం లేదు. ఇక్కడ మీకు ఇటీవల అల్లు అర్జున్‌తో జరిగిన సంభాషణ చెప్తాను. పుష్ప 1లో మనం ఇంకా ఏం చేయాల్సింది? సినిమాలో ఎక్కడైనా తప్పు చేశామా? అనేది చర్చ జరిగింది.
మా ముగ్గురి గురించే చెప్పట్లేదు
సినిమా హిట్టయినా, కాకపోయినా ఇలా ఎక్కడైనా తప్పు చేశామా? అనేదాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. నిజానికి ఇలాంటి సంభాషణలే మాకు ఎదగడానికి ఉపయోగపడతాయి. నేను మా ముగ్గురి(రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా) గురించే చెప్పడం లేదు. నాని, అడివి శేష్.. ఇలాంటి హీరోలంతా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేసేవాళ్లే! మేమంతా ఎప్పుడో ఒకసారి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లాను.
గదిలోకి వచ్చి ముఖం మీదే అడిగాడు
అప్పుడు అడివి శేష్ నా గదిలోకి వచ్చి.. నువ్వు వరుసగా సినిమాలు చేయడం లేదేంటి? నీ సినిమాలంటే నాకిష్టం.. కానీ నువ్వేమో చాలా గ్యాప్‌తో మూవీస్ చేస్తున్నావ్ అని అడిగాడు. నేనేమో అవునా.. సరే చేద్దాంలే అని బదులిచ్చాను. అప్పుడు శేష్.. నేను నీ కోసం కథ రాస్తాను.. ఒక ఏడాదిలోపు నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. అలా మనం పని చేయాలని కోరుకునేవాళ్లు, మనల్ని ఇష్టపడేవాళ్ల నుంచి మనకు ఎక్కడలేని శక్తి వస్తుంటుంది' అని చెప్పుకొచ్చాడు రానా దగ్గుబాటి.
Comments
Please login to add a commentAdd a comment