Rashmika Mandanna Revealed About Her Secret Marriage? - Sakshi
Sakshi News home page

Rashmika: పెళ్లి అయిపోయింది.. బాంబ్ పేల్చిన రష్మిక!

Published Thu, Aug 3 2023 7:27 AM | Last Updated on Fri, Aug 4 2023 8:48 AM

Rashmika Mandanna Marriage Comments Naruto - Sakshi

స్టార్ హీరోయిన్ రష్మిక మనసులో ఎవరున్నారు? అని అడిగితే.. అదేం పిచ్చి ప్రశ్న, డౌట్ లేదు.. విజయ్ దేవరకొండనే ఉంటాడని పలువురు ఫ్యాన్స్ చెబుతారు. గత కొన్నేళ్ల నుంచి ఈ తంతు నడుస్తూనే ఉంది. చేసింది రెండు సినిమాలే అయినా ఈ కాంబోకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే పెళ్లి, లవ్ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా స్పందించిన రష్మిక.. తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కన్నడ బ్యూటీ రష్మిక.. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. సొంత భాషలో మరో సినిమా చేస్తున్నప్పుడే తెలుగులో 'ఛలో' చిత్రంలో అవకాశమొచ్చంది. ఇది హిట్ అవడంతో ఈమెకు టాలీవుడ్ లో గుర్తింపు దక్కింది. అలా యంగ్ హీరోలతో మూవీస్ చేసిన రష్మిక.. మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'పుష్ప'తో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: ఈసారి బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే!)

కొన్నిరోజుల ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కి టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. ఇందులో భాగంగా హోస్ట్ ప్రశ్న అడగ్గా.. 'నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు' అని రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. 'నరుటో' అనేది ఫేమస్ అయిన ఎనిమీ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. వీటికి ప్రత్యేక అభిమానులు ఉంటారు. అందులో రష్మిక ఒకరు. ఇప్పుడు ఈమె నరుటో గురించి మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్న రష్మిక.. దీనితోపాటు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తోపాటు 'రెయిన్ బో' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. తెలుగులో నితిన్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. అయితే ఇందులో నుంచి ఆమె తప్పుకుందనే రూమర్స్ వచ్చాయి గానీ ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పెళ్లి రూమర్స్‌పై హీరో తరుణ్ క్లారిటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement