
బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాల్లోనూ పాల్గొని తన గాత్రంతో జడ్జిలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం కార్టూన్స్ చూసి హిందీ నేర్చుకున్న ఈ బాలగాయని
RRR Movie Singer Prakruthi Reddy: 'కొమ్మ ఉయ్యాల.. కోన జంపాల.. అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాల.. రోజూ ఊగాల..' అంటూ సాగే పాట ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్. అంత ఈజీగా మైండ్‌లో నుంచి పోయే సాంగ్ కాదిది. సినీప్రియులను మరీ ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ పాట పాడింది ఎవరో తెలుసా? చిన్నారి గాయని ప్రకృతి రెడ్డి.
చిన్నతనం నుంచి సంగీతం అంటే ఇష్టమున్న ఆమెకు తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సంగీత పోటీల్లోనూ పాల్గొంటూ తన ప్రతిభను చాటిచెప్పింది ప్రకృతి. బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో కార్యక్రమాల్లోనూ పాల్గొని తన గాత్రంతో జడ్జిలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం కార్టూన్స్ చూసి హిందీ నేర్చుకున్న ఈ బాల గాయని హిందీలోనూ అద్భుతంగా పాడగలదు. తెలుగు, హిందీ మాత్రమే కాదు తమిళంలోనూ అద్భుతంగా పాడుతూ అదరగొడుతోంది ప్రకృతి.
చదవండి: నటి సమీరా ఇల్లు చూశారా? ఒక్క అవార్డు కూడా కనిపించదు!