Rubina Dilaik Shares Health Update After Meeting With Car Accident - Sakshi
Sakshi News home page

Rubina Dilaik: బుల్లితెర నటి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌, నష్టం జరిగిపోయిందంటూ ట్వీట్‌

Published Sun, Jun 11 2023 11:09 AM | Last Updated on Sun, Jun 11 2023 11:37 AM

Rubina Dilaik Shares Update After Meeting with Car Accident - Sakshi

బుల్లితెర నటి రుబీనా దిలైక్‌ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమె కారు వెనక భాగం మాత్రం కొంత దెబ్బతింది. ఈ విషయాన్ని నటి భర్త, నటుడు అభినవ్‌ శుక్ల సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'ఈరోజు మాకు జరిగింది, రేపు మీకు కూడా జరగొచ్చు. ఫోన్‌లో మునిగిపోయి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లెక్కచేయకుండా ముందుకు వెళ్లే తెలివితక్కువవారితో జాగ్రత్త!

రుబీనా ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయింది. ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాను, ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉంది' అంటూ ట్విటర్‌లో కారు యాక్సిడెంట్‌కు సంబంధించిన రెండు ఫోటోలను షేర్‌ చేశాడు. ఈ ప్రమాదానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోండంటూ ముంబై పోలీసులను, ముంబై ట్రాఫిక్‌ పోలీసులను ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన ఫ్యాన్స్‌ రుబీనాను జాగ్రత్తగా చూసుకోండంటూ కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా ఈ ఘటనపై రుబీనా స్పందిస్తూ.. 'ఈ ప్రమాదంలో నా తలకు, వెన్నెముక కింద భాగానికి కొంత దెబ్బ తగిలింది. ఊహించని పరిణామానికి నేను షాక్‌లోకి వెళ్లిపోయా.. ఆస్పత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకోగా అంతా బాగానే ఉందని చెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా బండి నడిపిన ట్రక్కు డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. కానీ అప్పటికే కొంత నష్టం జరిగిపోయింది. నియమ నిబంధనలు అనేవి మన రక్షణ కోసమే ఉన్నాయి. కాబట్టి రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి' అని ట్వీట్‌ చేసింది.

చదవండి: సౌత్‌ హీరోయిన్‌ అని చులకనగా చూసేవారు, డిజైనర్‌ డ్రెస్సులు ఇచ్చేవారే కాదు: హన్సిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement