
రాను రానంటూనే చిన్నదో సాంగ్‌తో ప్రేక్షకుల మనసు దోచింది సదా. జయం సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సదాకు తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు రాలేవు. సినిమాలు తగ్గించేసిన సదా ప్రస్తుతం పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. బంధాలు, బంధుత్వాలు, ఒంటరితనం అంటూ మనసులోని మాటను వ్యక్తీకరించింది.
'మనకు నచ్చినవారిని కోల్పోతామేమోనని చాలామంది భయపడుతుంటారు. కానీ చాలా క్లోజ్‌గా ఉన్నవారు కూడా కొన్నిసార్లు మనకు సహకరించరు. అలాంటివారితో ఉంటున్నామంటే మనకు మనం హాని చేసుకున్నట్లే. కాబట్టి అలాంటివారిని దూరం పెట్టి ముందుకు సాగడమే మంచిది. మీరు ఒకరి కోసం త్యాగాలు చేసినా గుర్తింపు రాకపోతే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే మన జీవితంలో ఎంతో మంది మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కడవరకు నీకు నువ్వు మాత్రమే తోడుంటావు.
ఇంట్లో ఎలాగైతే అవసరం లేని వస్తువులను పడేస్తామో, అలాగే జీవితంలో కూడా కొందరు వ్యక్తులను తీసేయాలి. జీవితం చాలా చిన్నది. అనవసరమైన విషయాల కోసం దాన్ని పాడు చేసుకోకండి. బలవంతంగా బంధాల్లో ఇరుక్కునేకంటే ఒంటరిగా ఉండటమే ఎంతో మంచిది' అని రాసుకొచ్చింది సదా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: ఆ సినిమా రెమ్యునరేషన్ ఇప్పటికీ ఇవ్వలేదు: నటి
ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్యాయత్నం చేశా: సూర్య
Comments
Please login to add a commentAdd a comment