Sarkaru Vaari Paata Now Streaming On Amazon Prime With Pay Per View, Details Inside - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata In OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్‌, కానీ..

Jun 2 2022 3:05 PM | Updated on Jun 2 2022 6:26 PM

Sarkaru Vaari Paata Now Streaming On Amazon Prime With Pay Per View - Sakshi

Sarkaru Vaari Paata Now Streaming On Amazon Prime: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీ ఓటీటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్‌ షాకిచ్చింది. తాజాగా సర్కారు వారి పాటను స్ట్రీమింగ్‌ చేస్తున్న ఆమె ట్విస్ట్‌ ఇచ్చింది. ​విడుదలైన మూడు వారాలకే సర్కారు వారి పాట ఇప్పుడు అమెజాన్‌లో చేస్తుంది. అయితే ఈ మూవీని చూడాలంటే మాత్రం కండీషన్‌ అప్లై ఉంది.

చదవండి: మాల్‌లో ఛీల్‌ అవుతున్న తారక్‌, ఎక్కడో తెలుసా?

పే-పర్‌-వ్యూ పద్దతిలో సర్కారు వారి పాటను స్ట్రీమింగ్‌ చేస్తోంది అమెజాన్‌. ‘సర్కారి వారి పాట’ చూడాలంటే సబ్‌స్క్రైబర్లు మూవీ రెంటల్స్‌లో రూ. 199 చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటికే కేజీయఫ్‌ 2ను ఇదే విధానంలో అందుబాటులో తెచ్చిన ఆమెజాన్‌ ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. కాగా పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించాడు. 

చదవండి: ఆస్ట్రేలియా ఆఫర్‌, భారీ రెమ్యునరేషన్‌, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement