మొన్ననే నిశ్చితార్థం.. ఇంతలోనే బ్రేకప్‌ చెప్పేసిన 'దసరా' విలన్‌ | Shine Tom Chacko Announces Breakup With His Girl Friend Thanuja Ahead Of Marriage, Deets Inside | Sakshi
Sakshi News home page

Shine Tom Chacko Breakup: మొన్ననే నిశ్చితార్థం.. ఇంతలోనే బ్రేకప్‌ చెప్పేసిన 'దసరా' విలన్‌

Published Sun, Aug 4 2024 1:15 PM | Last Updated on Sun, Aug 4 2024 3:36 PM

Shine Tom Chacko Breakup His Girl Friend Thanuja

మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో త్వరలో రెండో పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన ప్రియురాలితో నిశ్చితార్ధం కూడా చేసుకున్న 40 ఏళ్ల షైన్‌ టామ్‌ ఇప్పుడు బ్రేకప్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన మాటలు షాక్‌కు గురిచేశాయి. తెలుగులో నాని నటించిన దసరా సినిమాలో విలన్‌గా మెప్పించిన షైన్ టామ్ చాకో ఆ తర్వాత రంగభళిలో కనిపించిన విషయం తెలిసిందే.

నటుడు షైన్ టామ్ సాకో మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో ఒకరు. మలయాళ సినిమా   నమ్మల్‌లో చిన్న పాత్రలో నటించి నటుడిగా మారారు. ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5 సుందరిగళ్, వినోద్ అక్క సూంట, దా తాడియా వంటి చిత్రాలలో విలన్‌గా మెప్పించాడు. యాక్టర్, కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్‌లో దళపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలో తీవ్రవాదిగా నటించి కోలీవుడ్‌కు దగ్గరయ్యాడు. అలా డబుల్ ఎక్స్‌లో జిగర్తాండలో మెరిశాడు. అలా సౌత్‌ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

40 ఏళ్ల షైన్ టామ్ చాకో తన చిరకాల స్నేహితురాలు, మోడల్ తనూజాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో, సైన్ టామ్ సాకో సోషల్ మీడియా నుంచి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో ఇటీవల ఇచ్చిన ఓ ఇంర్వ్యూలో తాను 'మళ్లీ సింగిల్' అని వెల్లడించాడు. తనూజాతో సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని పంచుకున్నాడు. 

తమ బంధం కలుషితంగా మారిందని వివరించాడు. ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని షైన్ టామ్‌ అంగీకరించాడు. ప్రస్థుతం తాను డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాడు. అయితే, అతనికి తబితా మాథ్యూస్ అనే భార్య, కూతురు ఉంది. వారిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement