
ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా? అంటే చాలామంది అబ్బేం, అదేం లేదని సులువుగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అదే ఇండస్ట్రీలో.. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే.. ఎస్, గతంలో పలువురితో ప్రేమలో పడ్డానంటూ చాంతాడంత లిస్టు బయటపెడతారు. కొందరు మాత్రం ఒకరిద్దరితోనే ఆగిపోతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బ్రదర్స్ కూడా డేటింగ్ ఎక్స్‌పీరియన్స్ చేసినవారే! సల్లూభాయ్ సోదరుడు, నటుడు సోహైల్ ఖాన్ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాజీ ప్రేయసి ఇంట్లో జరిగిన ఓ ఫన్నీ సంఘటనను షేర్ చేసుకున్నాడు.
దాగుడుమూతలు
'నా ప్రియురాలి(ప్రస్తుతం మాజీ గర్ల్‌ఫ్రెండ్) ఇంట్లో మేమంతా దాగుడుమూతలు ఆడాము. నేను వెళ్లి వార్డ్‌రోబ్‌లో దాక్కున్నాను. అప్పుడే మరొకరు అదే వార్డ్ రోబ్‌లో దూరారు. నా గర్ల్‌ఫ్రెండ్ వచ్చిందేమో అనుకున్నాను. అంతా చీకటిగా ఉండటంతో అసలేమీ కనిపించలేదు. నా పక్కన ఉంది ప్రేయసే అనుకుని ఏదేదో ఊహించుకున్నాను. కట్ చేస్తే లైట్లు ఆన్ చేశారు. అందరూ బయటకు వచ్చారు. గేమ్ అయిపోయింది.. ఇంకా ఎందుకు దాక్కున్నారు? అని అడిగారు. అప్పుడు కానీ నాతో ఉన్నది ప్రియురాలి తల్లి అని అర్థం కాలేదు' అంటూ నవ్వేశాడు.
అన్నింటికీ ఎక్స్‌పైరీ
సీమా కిరణ్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'ప్రతిదానికి ఎక్స్‌పైరీ ఉంటుంది. చాక్లెట్, మెడిసిన్, ఫుడ్.. ఇలా అన్నీ ఏదో ఒకరోజు పాడైపోయేవే. సంతోషంగా ఉన్నన్నాళ్లూ వైవాహిక బంధం బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఇద్దరి మధ్య నెగెటివ్ ఎనర్జీ వచ్చిందా? అది అంత ఈజీగా పోదు. గొడవలు పడుతూ ఉండే కంటే విడిపోవడమే మంచిది అని చెప్పుకొచ్చాడు. 1998లో సీమాను పెళ్లాడిన ఇతడు 2022లో విడాకులు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment