
నటుడు సోనూ సూద్ కరోనా వాక్సిన్ తొలి డోస్‌ను బుధవారం వేసుకున్నారు. వాక్సిన్ గురించి చైతన్యం కలిగింది ప్రజలను అందుకు ప్రోత్సహించాలని కోరాడు. కష్టాల్లో ఉన్నవారికి ఆదుకునే హీరోగా పేరు గడించిన సోనూ సూద్ కరోనా కష్టం నుంచి కాపాడే శక్తి తన కంటే వాక్సిన్‌కే ఎక్కువ ఉంది అని చెప్పడానికి బుధవారం టీకా వేయించుకున్నాడు. దేశ ప్రజలందరూ టీకా వేసుకోవాలని కోరాడు.
అలాగే దర్శకుడు అనుభవ్ సిన్హా కూడా బుధవారం టీకా వేయించుకున్నవారిలో ఉన్నాడు. కరోనా సెకండ్‌వేవ్‌లో బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా దాని బారిన పడుతుండగా మెల్లగా వారిలో కదలిక వచ్చి టీకా వైపు చూస్తున్నారు. అమితాబ్ తన బ్లాగ్‌లో టీకా వేయించుకోవడాన్ని ప్రోత్సహిస్తూ రాశాడు. మరోవైపు నటుడు అక్షయ్ కుమార్ ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో చేరడం కూడా కరోనా గురించి మనకు ఉండాల్సిన అప్రమత్తత తెలియచేస్తోంది.
కర్ణాటక: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సైతం బుధవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. 45 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలని మనవి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment