కొమురం భీముడో నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సాంగ్‌: రాజమౌళి | SS Rajamouli: Komuram Bheemudo is My All Time Favourite Song | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తిన జక్కన్న, వీడియో వైరల్‌

Published Sun, Jan 8 2023 6:07 PM | Last Updated on Sun, Jan 8 2023 6:39 PM

SS Rajamouli: Komuram Bheemudo is My All Time Favourite Song - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ అయిన ఈ సినిమాను ఎస్‌ఎస్‌ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులోని ప్రతి పాటా హిట్టే.. కొమురం భీముడో సాంగ్‌ అయితే మరింత స్పెషల్‌. సినిమాను మలుపు తిప్పే ఈ పాటలో తారక్‌ పర్ఫామెన్స్‌, ఆ మ్యూజిక్‌ వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ప్రేక్షకులకే కాదు తనకూ ఆ పాట ఫేవరెట్‌ అంటున్నాడు జక్కన్న.

శనివారం లాస్‌ ఏంజిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్క్రీనింగ్‌కు హాజరయ్యాడు రాజమౌళి, తారక్‌. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ తాను డైరెక్ట్‌ చేసిన చిత్రాల్లో కొమురం భీముడో పాట కానీ, ఆ సన్నివేశం కానీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని వెల్లడించాడు. ఈ పాటలో కెమెరాను జూమ్‌ చేసి తారక్‌ కనుబొమ్మ మీద పెట్టినా సరే ఆ కనుబొమ్మ కూడా పర్ఫామ్‌ చేస్తుంది.. అంత గొప్ప నటుడు తారక్‌ అని ప్రశంసలు కురిపించాడు జక్కన్న. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా గతేడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు అందుకుంది.

చదవండి: చివరి నిమిషంలో చిరంజీవికి హ్యాండిచ్చిన శ్రుతిహాసన్‌
బెల్ట్‌ తీసి భయపెట్టిన శ్రీహాన్‌... చిన్మయి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement