రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్‌ స్టార్‌? వీడియో వైరల్‌ | Sunny Deol Clarifies About Viral Video Of Him Seen Roaming Drunk On Mumbai Streets | Sakshi
Sakshi News home page

Sunny Deol: పూటుగా తాగి నడిరోడ్డుపై వీరంగం? వీడియో షేర్‌ చేసిన బాలీవుడ్‌ స్టార్‌

Published Wed, Dec 6 2023 3:31 PM | Last Updated on Wed, Dec 6 2023 5:08 PM

Sunny Deol Clarifies About Viral Video Of Him Seen Roaming Drunk On Mumbai Streets - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ డియోల్‌ నడిరోడ్డుపై తాగి తూగుతున్నట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. పూటుగా తాగడమే కాకుండా పబ్లిక్‌లో ఇలా వీరంగం సృష్టిస్తున్నాడేంటని నెటిజన్లు సన్నీని తిట్టిపోస్తున్నారు. పేరుకే సెలబ్రిటీ.. కానీ చేసే పనులు ఇలా ఉంటాయని విమర్శిస్తున్నారు. దీంతో ఈ ట్రోలింగ్‌కు చెక్‌ పెడుతూ ఈ వైరల్‌ వీడియో వెనుక అసలు రహస్యాన్ని బయటపెట్టాడు నటుడు. ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఒరిజినల్‌ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో కెమెరాలు పట్టుకుని నడుస్తుండగా వాటి ముందు సన్నీ తాగి తూలుతున్నట్లుగా నటిస్తున్నాడు.

ఇంతలో ఓ వ్యక్తి.. టాక్సీని ముందుకు రమ్మనండి అని చెప్పడంతో కారు నడిపే వ్యక్తి సన్నీదగ్గరకు పోనిచ్చాడు. అంటే సినిమా చిత్రీకరణలో భాగంగా సన్నీ డియోల్‌ ఇలా ప్రవర్తించాడన్నమాట. ఇప్పటికైనా పుకార్లకు చెక్‌ పడుతుందని ఆశిస్తున్నానంటూ సదరు వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు నటుడు. ఇది చూసిన అభిమానులు.. నిన్ను ద్వేషించేవాళ్లు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. వాటినేమీ పట్టించుకోవద్దు, ఆల్‌ ద బెస్ట్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

మీ డైహార్డ్‌ ఫ్యాన్‌గా మీరేంటో నాకు తెలుసు.. మీకు మద్యం తాగే అలవాటు లేదు. ఒకవేళ డ్రింక్‌ చేసినా ఇలా చీప్‌గా ప్రవర్తించరు. మీ నెక్స్ట్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. మరికొందరేమో ప్రమోషనల్‌ స్ట్రాటజనీ బాగుంది అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా సన్నీ డియోల్‌ హీరోగా గదర్‌ 2 సినిమా చేశాడు. ఈ మూవీ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఇతడు బాప్‌, లాహోర్‌ 1947, సూర్య సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: తెలుగింటి హీరోయిన్‌.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement