Thalapathy 67: Vijay Fight With 6 Villains In Lokesh Kanagaraj Next Movie - Sakshi
Sakshi News home page

Vijay Thalapathy 67: లోకేశ్‌ కనకరాజు-విజయ్‌ చిత్రం, ‘విక్రమ్‌’ను మించిన స్క్రిప్ట్‌! అదిరిపోయిందిగా..

Aug 8 2022 12:29 PM | Updated on Aug 8 2022 3:02 PM

Thalapathy 67: Vijay Fight With 6 Villains In Lokesh Kanagaraj Next Movie - Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం వరీసు(తెలుగులో వారసుడు) మూవీతో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘విక్రమ్‌’ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజుతో ఓ సినిమా చేయనున్నాడు. విజయ్‌-లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మాస్టర్‌ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెపన్కర్లేదు. దీంతో వీరిద్దరు కాంబో వచ్చే ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి ఈ మూవీ కథేంటి, ఈసారి ఏ థీమ్‌తో రాబోతున్నారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. 

చదవండి: శృంగార జీవితంపై హీరోయిన్‌ తాప్సీ బోల్డ్‌ కామెంట్స్‌

ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టించ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్‌ మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా గ్యంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దళపతి 67వ చిత్రంగా రాబోతున్న ఇందులో విజయ్‌ ఓ దాదాగా కనిపించనున్నాడట. ఇక ఇందులో విజయ్‌ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్‌ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు దాదాగా రేంజ్‌ తగ్గట్టుగా ఆరుగురు పవర్ఫుల్‌ విలన్స్‌ విజయ్‌ తలబోతున్నాడట. ఈ క్రమంలో విజయ్‌ వారిపై వేసే ఎత్తులు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఉండనున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు

ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ మెయిన్‌ విలన్‌గా కనిపంచనున్నాడని వినికిడి. సంజయ్‌తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్‌, టాలీవుడ్‌ నుంచి కూడా ఓ ప్రముఖ నటుడిని ప్రతికథానాయకులుగా ప్లాన్‌ చేస్తున్న ఫిలిం దూనియాలో గుసగుల వినిపిస్తున్నాయి. మరి ఈ కథపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇటీవల విజయ్‌తో తన ప్రాజెక్ట్‌ అధికారికంగా ప్రకటించిన లోకేశ్‌ కనకరాజు ఇటీవల తాత్కాలికంగా సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్రీప్ట్‌ వర్క్‌ జరుగుతున్న నేపథ్యంలో కథ ఇలా బయటకు రావడంపై పలు సందేహాలు నెలకొన్నాయి. మరి దీనిపై దర్శకుడు, మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement