
బీస్ట్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో వెల్లడించింది. ఈ మేరకు హీరో విజయ్ సరికొత్తగా కనిపిస్తున్న పోస్టర్ వదిలింది. ఇందులో ఏప్రిల్ నెలలో సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఏ తేదీ అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది.
విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆర్నెళ్ల క్రితం రిలీజైంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. బీస్ట్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో వెల్లడించింది. ఈ మేరకు హీరో విజయ్ సరికొత్తగా కనిపిస్తున్న పోస్టర్ వదిలింది. ఇందులో ఏప్రిల్ నెలలో సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఏ తేదీ అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది.
Happy New Year Nanba ❤ ⁰From team #Beast @actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @manojdft @Nirmalcuts @anbariv #BeastFromApril pic.twitter.com/xNYz8kGYwP
— Sun Pictures (@sunpictures) December 31, 2021
జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది బీస్ట్. చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.