
దర్శకుడు అర్జున్ జంధ్యాల
తెలుగు దర్శకుడు అర్జున్ జంధ్యాల ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి డాక్టర్ జంధ్యాల చంద్ర భాస్కర శాస్త్రి శనివారం(జూన్ 24న) కన్నుమూశారు. ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని నర్సింగోలులో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా అర్జున్ జంధ్యాల.. కార్తికేయ గుమ్మకొండతో గుణ 369 సినిమా తీశాడు. దీనికంటే ముందు అతడు బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంట్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. సరైనోడు, జయ జానకి నాయక వంటి చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. గుణ 369తో దర్శకుడిగా మారిన అతడు ప్రస్తుతం యంగ్ హీరో అశోక్ గల్లాతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు రాస్తుండగా ఎస్. బాలకృష్ణ నిర్మిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment