వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు కూలిపోయిందట. అలా ఉంది చంద్రబాబు పరిస్థితి. 40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చివరకు రూ. 371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు.
ఇక లోకేశ్ పరిస్థితి అయితే ‘ఆడికి పోయినా రూపాయి పావలే ఈడికి పోయిన రూపాయి పావలే’అన్నట్లుగా ఉంది. నత్తి మాటలు, విచిత్రమైన ప్రవర్తనతో ఏపీలో ‘పప్పు’గా మిలిగిపోయాడు. ఇక్కడ మాట్లాడితే చెల్లదని.. ఢిల్లీకి వెళ్లి మా అయ్య నిప్పు.. సపోర్ట్ చేయండని వేడుకుంటున్న.. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక పచ్చ మీడయా బ్యాచ్ అయితే తమ కుల దైవాన్ని బయటకు తెచ్చుకునేందుకు నానా పాట్లు పడుతోంది. అయినా కూడా ప్రజలను నుంచి మద్దతు లభించట్లేదు. పైగా బాబు అరెస్ట్‌ను సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు సినీ ప్రముఖులు సైతం చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థిస్తున్నారు.
స్టార్ హీరో సంబరాలు.. స్నేహితులకు మందు పార్టీ
చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోగా ఆనందం వ్యక్తం చేశాడు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అయిందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఇటీవల తన సన్నిహితులకు, స్నేహితులకు మద్యం పార్టీ కూడా ఇచ్చాడట. ఈ పార్టీకి టాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ హీరోతో పాటు ఓ పాన్ ఇండియా స్టార్ కూడా హాజరయ్యారట. పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా ఆ స్టార్ హీరో ఇచ్చిన పార్టీకి హాజరై..చంద్రబాబు అరెస్ట్‌ని సెలబ్రేట్ చేసుకున్నారట.
చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరో పార్టీ
చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. తమ నాయకుడికి మద్దతు ప్రకటించమని టీడీపీ నాయకులు వేడుకున్నా.. ఏ ఒక్క హీరో కూడా స్పందించలేదు. డైరెక్టర్ రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌తో పాటు నట్టి కుమార్ మాత్రమే స్పందించారు. అదీ కూడా టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకే అని సమాచారం. ప్రభాస్, ఎన్టీఆర్,చిరంజీవి, నాగార్జున లాంటి బడా హీరోలు స్పందించాలని జేసీ ప్రభాకర్ లాంటి నాయకులు బహిరంగంగా వేడుకున్నా.. వాళ్లు పట్టించుకోవట్లేదు. అవితీని కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి మద్దతు తెలిపితే ప్రజల్లో అభాసు పాలవుతామని వారికి తెలుసు కాబట్టే సైలెంట్ అయిపోయారని సినీ పండితులు చెబుతున్నారు.
(చదవండి: చంద్రబాబు అరెస్ట్.. సినిమా వాళ్లు స్పందించడం సరికాదు: సురేశ్ బాబు)
బాబుకు మద్దతు ప్రకటించమని పలువురు టీడీపీ నాయకులు స్టార్ హీరోలు ఇళ్ల చుట్టు తిరుగుతున్న సమయంలో.. స్టార్ హీరో పార్టీ ఇచ్చారనే విషయం తెలిసి షాకయ్యారట. పైగా ఆ పార్టీకీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పలువురు దర్శక, నిర్మాతలు హాజరవ్వడం టీడీపీని కలవరపాటుకు గురి చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు టీడీపీ వర్గాల్లోనూ స్టార్ హీరో పార్టీ చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment