నటితో ఎఫైర్‌ పెట్టుకో, రూమ్‌ కూడా రెడీ అన్నారు | Tum Bin Actor Himanshu Malik Was Asked By Magazine To Have an Affair With Actress | Sakshi
Sakshi News home page

Himanshu Malik: నటితో ఎఫైర్‌ పెట్టుకో, ఫేమస్‌ చేస్తామన్నారు

May 22 2022 10:40 AM | Updated on May 22 2022 10:40 AM

Tum Bin Actor Himanshu Malik Was Asked By Magazine To Have an Affair With Actress - Sakshi

తుమ్‌ బిన్‌ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు హిమన్షు మాలిక్‌. ప్రియాన్షు చటర్జీ, సండలి సిన్హ, రాకేశ్‌ బాపత్‌, అమృత ప్రకాశ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో హిమన్షు లీడ్‌ రోల్‌లో నటించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హిమన్షు ఓ షాకింగ్‌ సంఘటనను పంచుకున్నాడు. తాను వార్తల్లో నిలవాలంటే ఎవరితోనైనా ఎఫైర్‌ ఉండాలని అడిగారని చెప్పుకొచ్చాడు.

''తుమ్‌ బిన్‌ సినిమా తర్వాత నేను చాలా డిస్టర్బ్‌ అయ్యాను. ఎందుకంటే ఆ సమయంలో ప్రముఖ మ్యాగజైన్‌ వాళ్లు నన్ను ఫోన్‌లో సంప్రదించారు. 'కొత్తతరం నాయికలతో ఏదైనా ఎఫైర్‌ పెట్టుకున్నావంటే ఒక మంచి స్టోరీ అవుతుంది. పబ్లిసిటీ లేకుండా ఎవరూ స్టార్‌ అవలేరు. మేము ఇంకో ఇద్దరితో కూడా మాట్లాడి వాళ్లను కూడా నీలాగే ఫేమస్‌ చేస్తాం. ముందైతే నీకు గోవాలో ఒక రూమ్‌ ఏర్పాటు చేస్తాం. నువ్వు అక్కడికి వెళ్లు, ఆ తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాం' అని చెప్పాడు. ఆ మాటలు విని షాకయ్యాను" అని హిమన్షు చెప్పుకొచ్చాడు. కాగా హిమన్షు చివరగా చిత్రకూట్‌ సినిమాలో నటించాడు.

చదవండి 👉🏾 

ఈ సినిమా హిట్‌ కాకపోతే ఇకపై మీ ముందు నిలబడను: రాజేంద్రప్రసాద్‌

మేజర్‌ ఓటీటీకి వెళ్తుందా అని భయం వేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement