TV Actress Nakshatra Complaint Against Harassment That Took Place In A Bus - Sakshi
Sakshi News home page

Nakshathra: బస్సు డ్రైవర్‌ అసభ్యంగా తాకాడు: సీఎంలను ట్యాగ్‌ చేసిన నటి

Published Sat, Aug 20 2022 7:31 PM | Last Updated on Sat, Aug 20 2022 8:27 PM

TV Actress Nakshatra Complaint Against Harassment That Took Place In A Bus - Sakshi

ఓ బస్సు డ్రైవర్‌ నీచంగా ప్రవర్తించాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వాపోయింది బుల్లితెర నటి నక్షత్ర. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులను కోరింది. వల్లి తిరుమనం, యారది నీ మోహిని వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకుంది మలయాళ నటి నక్షత్ర. ఇటీవల ఈమె సోదరి చెన్నై నుంచి కేరళలోని తమ స్వస్థలం అలువా వెళ్లడానికి ఓ ప్రైవేటు బస్సు ఎక్కింది. అర్ధరాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న సమయంలో బస్సులో ఉన్న రెండో డ్రైవర్‌ ఆమెను అసభ్యంగా తాకాడు.

వెంటనే తేరుకున్న ఆమె ఏం చేస్తున్నావని నిలదీయగా పొరపాటున చేయి తగిలిందంటూ తప్పును కప్పి పుచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అతడు కావాలనే తప్పుగా ప్రవర్తించాడని అర్థమైన నక్షత్ర సోదరి బస్సులో ఉన్న మిగతా ప్రయాణిలకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అక్కడి కొందరు ప్రయాణికులు సైతం తమతోనూ అతడు అలాగే ప్రవర్తించాడని ఆరోపించారు.

తన చెల్లిని లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఫొటోను షేర్‌ చేస్తూ నక్షత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. ఆ బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌లను ట్యాగ్‌ చేసింది.

చదవండి: బాలీవుడ్‌కు షాకిస్తున్న కార్తికేయ 2 వసూళ్లు
హీరో వరుణ్‌తేజ్‌తో డేటింగ్‌? నోరు విప్పిన అందాల రాక్షసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement