బుల్లితెర నటి వాబిజ్ దొరబ్జీ 37 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడింది. గతంలో భర్తతో విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉంటున్న ఆమె తనకు మళ్లీ కొత్త జీవితం స్టార్ట్ చేసే హక్కు లేదా? అని ప్రశ్నిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'గతంలో ఏదో జరిగినంతమాత్రాన మళ్లీ ప్రేమను పొందే అర్హత నాకు లేదా? నేను కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటాను. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడే దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు.
విడాకుల బాధ నుంచి కోలుకున్నా
సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు మీకే తెలుస్తాయి. లైఫ్‌లో నేను రెండో ఛాన్స్ తీసుకోవాలనుకున్నాను. అందుకు నాకు పూర్తి అర్హత ఉంది. విడాకుల సమయంలో నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుని నిలబడ్డాను. పగిలిన మనసు ముక్కలను తిరిగి అతికించాను. కుటుంబసభ్యులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను.
నా వయసున్న హీరోకు తల్లిగానా? నో ఛాన్స్
సొంతంగా డబ్బు సంపాదిస్తున్నాను, స్వతంత్ర మహిళగా అది నాకు చాలా విశ్వాసాన్ని ఇచ్చింది. నాకు వస్తున్న కొన్నిరకాల పాత్రలపై నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. హీరో తల్లిగా చేయమని అడుగుతున్నారు. నా వయసు ఉన్న వ్యక్తికి నేను తల్లిగా ఎలా చేయగలను? ఇలాంటి ఆఫర్స్ చూస్తే నవ్వొస్తుంది, కానీ ఇది నిజంగా అన్యాయం. ఇండస్ట్రీలో ఇంకా అసమానతలున్నాయి. అనుపమ సీరియల్‌లో నటి రూపాలీ గంగూలీదే మెయిన్ రోల్. అలాంటి మహిళా ప్రాధాన్య పాత్రలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకుని, చివరకు..
అదృష్టవశాత్తూ నాకు వేరే మార్గం ద్వారా కూడా ఆదాయం వస్తోంది. కాబట్టి పూర్తిగా ఇదే ఇండస్ట్రీపై ఆధారపడలేదు. మంచి అవకాశం వచ్చేవరకు నేను ఎదురుచూస్తాను' అని వివరించింది నటి. కాగా వాబిజ్ దొరబ్జీ, నటుడు వివియన్ డిసెనా ప్యార్ కీ ఎ ఏక్ కహానీ సీరియల్‌లో కలిసి నటించారు. సెట్స్‌లో లవ్‌లో పడ్డ వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకోగా 2017లో విడాకులు తీసుకున్నారు.
చదవండి: ప్రెగ్నెన్సీ.. బరువు గురించి ఇలియానా ఆందోళన చెందుతోందా?
Comments
Please login to add a commentAdd a comment