లైగర్‌తో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ ప్రేమకథా చిత్రం వచ్చే నెల ఒకటో తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ ఈవెంట్‌లో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు రౌడీ హీరో. అనసూయతో వివాదం మొదలు తన పెళ్లి వరకు అనేక విషయాలపై మాట్లాడాడు.
పేరు ముందు The ఎందుకు వాడారన్న ప్రశ్నకు.. 'మా అమ్మానాన్న పెట్టిన విజయ్ దేవరకొండ అనే పేరు నాకు సరిపోతుంది. నా పేరు ముందు సౌత్ సెన్సేషన్, రౌడీ స్టార్ అని ఏవేవో ట్యాగులు తలిగిస్తుంటే.. అవేవీ వద్దు... ద విజయ్ దేవరకొండ అని పెట్టండి సరిపోతుందన్నాను' అని క్లారిటీ ఇచ్చాడు హీరో. సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా విజయ్ ఫ్యాన్స్, అనసూయ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అసలీ వివాదమేంటి? దీనికి ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు.. 'సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. గొడవపడేవాళ్లను అడగండి' అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.
పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. రెండు, మూడేళ్లలో నా పెళ్లి జరుగుతుందనిపిస్తోంది. జీవిత భాగస్వామి కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ ఇప్పుడే పెళ్లికి రెడీగా లేను. మొదట్లో పెళ్లి అంటే కోపమొచ్చేది. ఎవరైనా ఆ ప్రస్తావన తెచ్చినా చిర్రెత్తుకొచ్చేది. కానీ ఇప్పుడలా అనిపించడం లేదు. పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ప్రేమను, గొడవలను అన్నింటినీ చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వివాహం గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే అధ్యాయం ఉంటుంది. అందరూ దాన్ని అనుభవించి తీరాల్సిందే!' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: రష్మీపై సుధీర్ కామెంట్లు వైరల్
Comments
Please login to add a commentAdd a comment