
విజయ్ ఇప్పటికే రౌడి వేర్ అంటూ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల మాదిరి..
సినిమా హీరోలు ఇతర వ్యాపారాల్లోకి అడుగు పెడుతున్నారు. సినిమాలతో సంపాదించిన సొమ్మంతా ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో చాలామంది స్టార్ హీరోలు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొందరు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలే చేస్తుంటే.. మరికొందరు పుడ్,, ఫ్యాషన్ వరల్డ్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే టాలీవుడ్‌లో మహేశ్ ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ప్రారంభించిన ఏఎంబి సూపర్ సక్సెస్ అయింది. భారీ స్క్రీనింగ్, అద్భుతమైన సీటింగ్‌తో ఇండియాలో వన్ అఫ్ ద బెస్ట్ మల్టీప్లెక్స్‌గా పేరు తెచ్చుకుంది. మహేశ్‌తో పాటు వెంకటేష్, వినాయక్, ప్రభాస్ లాంటి సినీ ప్రముఖులకు కూడా సొంత థియేటర్స్ ఉన్నాయి. అంతే కాదు అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఓ మల్లీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాడు. అమీర్‌పేట సత్యం థియేటర్ స్థానంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ హీరోల సరసన ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా చేరాడు.
విజయ్ ఇప్పటికే రౌడి వేర్ అంటూ వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల మాదిరి మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసాడు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఏవీడీ సినిమాస్ (ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ )అని పేరు పెట్టారు.అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఏవీడీ సినిమాస్ ప్రారంభంకానుందట.
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.