This Week OTT Release Movies and Web Series - Sakshi
Sakshi News home page

Ott Releases: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే

Mar 23 2023 6:36 PM | Updated on Mar 23 2023 7:11 PM

This Week Ott Release Movies And web series - Sakshi

ప్రస్తుతం సినిమాను థియేటర్లలో కంటే ఓటీటీలో చూసేందుకు సినీ ప్రేక్షకులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఉగాదికి ముందు కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలో సందడి చేశాయి.  అయితే ఓటీటీలో సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారంలో మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. అలాగే ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. 

'బలగం' వచ్చేస్తోంది

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం బలగం. ఈ చిత్రం ద్వారా వేణు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా మార్చి 24వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీసౌత్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

షారూక్‌ ఖాన్‌ పఠాన్‌

షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ పఠాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ఈ మవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు.

విమానాన్ని హైజాక్‌ చేస్తే

యామి గౌతమ్‌, సన్నీ కౌశల్‌, శరద్‌ ఖేల్కర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘చోర్‌ నికల్‌ కె భాగా’. ఈ చిత్రానికి అజయ్‌ సింగ్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మార్చి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్‌

  •     వాకో- వెబ్‌సిరీస్‌ 
  •     ది నైట్‌ ఏజెంట్‌ -వెబ్‌సిరీస్‌- మార్చి 23
  •     చోర్‌ నికల్‌ కె భాగా -హిందీ- మార్చి 24
  •     హూ వర్‌ వుయ్‌ రన్నింగ్‌ ఫ్రమ్‌ -టర్కీస్ సిరీస్-మార్చి 24
  •     హై అండ్‌ లో ద వరస్ట్ ఎక్స్ -కొరియన్ మూవీ- మార్చి 25
  •     క్రైసిస్ -ఇంగ్లీష్ మూవీ-మార్చి 26

అమెజాన్‌ప్రైమ్‌

  •     హంటర్‌ -హిందీ- మార్చి 22
  •     పఠాన్‌ -హిందీ- మార్చి 22
  •     బకాసురన్‌ -తమిళం- మార్చి 24

జీ5

  •     కంజూస్‌ మక్కీ చూస్‌ -హిందీ- మార్చి 24
  •     పూవన్‌ -మలయాళం- మార్చి 24

సోనీలివ్‌

  •     పురుషప్రేతం -మలయాళం- మార్చి 24

బుక్‌ మై షో

  •     మ్యాక్స్‌ స్టీల్‌ -హాలీవుడ్- మార్చి 24
  •      ఆన్‌ ది లైన్‌ -హాలీవుడ్‌- మార్చి 24

ఆహా

  •     డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ -తెలుగు డబ్బింగ్ సిరీస్- మార్చి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  •     సక్సెసెన్ సీజన్ 4 -ఇంగ్లీష్ సిరీస్- మార్చి 26

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement