త్రిసూర్: కరోనా మహమ్మారి సినీ రంగంలో పెనువిలయాన్ని సృష్టిస్తోంది. పలువురు సినీ రంగానికి చెందిన కరోనా బారిన పడి అసువులు బాశారు. మలయాళ సినీరంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, నటుడు మాడంపు కుంజుకుట్టన్ (81) కన్నుమూశారు. ఇటీవల కోవిడ్-19 సంబంధిత లక్షణాలతో త్రిశూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా నిర్దారణ అయింది. చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. త్రిస్సూర్ జిల్లాలోని కిరలూర్‌కు చెందిన మాడంపు శంకరన్ నంబూద్రి (మాడంపు కుంజికుట్టన్) అనేక మలయాళ చిత్రాలకు స్క్రీన్ ప్లే రాశారు. పలు సినిమాల్లో కూడా నటించారు.
2000లో జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన కరుణమ్ చిత్రానికి కుంజుకుట్టన్ ఉత్తమ స్క్రిప్ట్ రైటర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మకాల్కు, గౌరీశంకరం, సఫలం, కరుణం, దేశదానం వంటి సినిమాలకు స్క్రిప్ట్స్ రాశారు. సాహిత్య , సినీ లోకం మడంపు అని ప్రేమగా పిలిచుకునే కుంజుకుట్టన్ 10కి పైగా నవలలు రాశారు. పైత్రికం, వడక్కున్నాథన్, కరుణమ్, దేశదానం, ఆరంతాంపురం సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment