
గ్రూప్–1 ర్యాంకర్‌కు ఏఎస్పీ సన్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తన కార్యాలయంలో సోమవారం ప్రవీణ్‌ను ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవుల్లో చేరి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రవీణ్‌కుమార్ నిరూపించాడని గ్రామస్తులు, ప్రజలు అభినందించారు.