బీసీ వసతి గృహాల్లో వస్తువుల సరఫరాకు దరఖాస్తులు
నాగర్‌కర్నూల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలు, బీసీ ఫ్రీ, పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాలకు అవసరమైన 26 రకాల వంట పాత్రలు, ఇతర సామగ్రిని సరఫరా చేయడానికి ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు టెండర్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.20 వేలు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి పేరు మీద డీడీ రూపంలో చెల్లించాలన్నారు. టెండర్ షెడ్యూల్ ఫారం తమ కార్యాలయంలో శనివారం అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తిచేసిన టెండర్ ఫారాన్ని ఈ నెల 7 సాయంత్రంలోగా అక్కడే అందించాలన్నారు. టెండర్‌ను 10న మధ్యాహ్నం 3.00 గంటలకు తెరుస్తామన్నారు.
పాలెం వెంకన్నాలయంలో గరుడ ప్రసాదం వితరణ
బిజినేపల్లి: మండలంలోని పాలెం అలివేలు మంగసమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంతానం లేని వారికి ఆలయంలో స్వామివారి గరుడ పొంగళి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం పాలెం వేంకటేశ్వరస్వామి వారికి సుప్రభాతసేవ, నిత్యారాధన, హోమ బలిహరణం, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివార్లను హనుమంత వాహనంపై ఉంచి ఆలయ తిరు వీధుల్లో ఊరేగించారు. ప్రధానంగా సంతానం లేని వారికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా గరుడ పొంగళిని స్వామివార్లకు అందించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు.
సరస్వతిదేవికి
సామూహిక అభిషేకాలు
కందనూలు: జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సరస్వతిదేవి ఆలయంలో 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నవగ్రహ హోమ పూజలు, సరస్వతిదేవికి విద్యార్థులచే సామూహిక అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నవీన్‌కుమార్‌శర్మ మాట్లాడుతూ మాఘమాసం పాడ్యమి నుంచి శ్యామలాదేవి నవరాత్రులు వైభవంగా జరుగుతాయని, ఆదివారం జరిగే వసంత పంచమి వేడుకలో అందరూ పాల్గొనాలని కోరారు. జిల్లాకేంద్రానికి చెందిన గీతాంజలి ఉన్నత పాఠశాల, గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతిదేవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవిశర్మ, అధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం .. ఎమ్మెల్యేతో సంప్రదించి బ్రహ్మోత్సవాలకు ఏ రోజు వచ్చేది చెబుతానని పేర్కొన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మన్యంకొండ దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment