ఊర్కొండపేట అభయాంజనేయస్వామి శుక్రవారం గజవాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం గజ వాహనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
ఉమ్మడి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్త్రృత అవకాశాలు ఉన్నా నిధులు, ప్రోత్సాహం లేక ఆశించినంత పురోగతి సాగడం లేదు. నల్లమల అటవీప్రాంతం, సుందరమైన కృష్ణాతీర ప్రాంతాలు, పురాతన దేవాలయాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టిపెట్టడం లేదు. ఉమ్మడి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలతో టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్యాటక అభివృద్ధికి ఊతం ఇచ్చేనా?
Comments
Please login to add a commentAdd a comment