అదనపు రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ, అధిక ఆర్థిక భారం కానున్న నేపథ్యంలో ఎంజీకేఎల్‌కే ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీల వెంట ఉన్న 20 ఆన్‌లైన్ చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలని నిర్ణయించారు. వనపర్తి నియోజకవర్గంలో గొల్లపల్లి, గోపాల్‌పేట, ఖిల్లాఘనపురంలోని గణపసముద్రం, బుద్దారం, గట్ల ఖానాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో వడ్డెమాన్, ఇంద్రకల్, బలాన్‌పల్లి, నేరెళ్లపల్లి, చిన్నముద్దనూరు, గడ్డంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గంలో మాధారం, జూపల్లి, ఆలమెట్ట బావి తండా, బొల్లంపల్లి, జిల్లారం తండా.. కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్‌గల్ చెరువు, అచ్చంపేట నియోజకవర్గంలో ఉప్పునుంతల, తాడూరు చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు అవసరమైన అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఆయా చెరువుల పరిధిలో మొత్తం 9.95 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో రూ.87 కోట్ల వ్యయంతో బుద్దారం, గణపసముద్రం చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు కొనసాగుతుండగా.. మిగతా వాటివి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment