ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఈ బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇంకా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు చేపట్టిన పనులకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వం రూ.2,514 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లోనూ ప్రభుత్వం రూ.2 వేల కోట్లే కేటాయించగా, ఆ మాత్రం నిధులను కూడా ఖర్చు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్ట్ పను లు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు.