నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు చెప్పుకొని అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 11 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో పోలీస్ ప్రజావాణికి తగు న్యాయం చేయాలని 6, భూమి పంచాయతీకి సంబంధించి 4, భార్యాభర్తల గొడవపై ఒక ఫిర్యాదు వచ్చాయన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ప్రయాణికులు సెల్ నం.73824 46772కు ఫోన్ చేసి ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
27న గ్రీవెన్స్ డే
కందనూలు: విద్యుత్ వినియోగదారుల సమస్యలపై జిల్లాకేంద్రం హెచ్‌బీకాలనీలోని ఎస్‌ఈ కార్యాలయంలో గురువారం సీజీఆర్‌ఎఫ్(కన్జూమర్ గ్రేవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీపాల్‌రాజు, డీఈ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యే వారు ఆధారు, కరెంట్ బిల్లు రశీదు తీసుకొని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోవాలని కోరారు. నాగర్‌కర్నూల్ సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
నేడు న్యాయవాదులు విధుల బహిష్కరణ
పాలమూరు: హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయెల్‌ను హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో విధులు బహిష్కరిస్తున్నట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టులో పనిచేసే న్యాయవాదులు మొత్తం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో న్యాయవాదుల హత్యలతోపాటు దాడులు పెరగడం బాధాకరమన్నారు.
‘ప్రజావాణి’కి 27 అర్జీలు