బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్
ప్రమాదం దురదృష్టకరం
ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, సొరంగమార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు విఫలమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేక పోతోందని విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీపై రాజకీయ యుద్ధం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్తాన్‌లో ఓ చిన్న కేసు విషంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరునెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేడం లేదని విమర్శించారు. కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50శాతం రిజర్వేషన్ దాటవద్దని సుప్రీంకోర్టు చెపుతున్నా.. పార్లమెంట్‌లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు నూనె నాగేశ్వర్‌రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్ హశం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండీ సలీం, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ విధానాలను ఎండగట్టడంలో
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విఫలం
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం
Comments
Please login to add a commentAdd a comment