సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
నల్లగొండ: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సైబర్ నేరాలపై నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూంటారని, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ మన నుంచి డబ్బులు కాజేస్తారని అన్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ 1930కి నంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవద్దన్నారు. ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మోసాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి , నల్లగొండ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు, రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ
సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment