రామగిరి(నల్లగొండ): జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, సైబర్ క్రైమ్ కేసులు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, ఇన్సూరెన్సు అధికారులు, రెవెన్యూ అధికారులు, బ్యాంకు అధికారులు సహకరిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment