ముగిసిన సాగర్‌మాత మహోత్సవాలు
నాగార్జునసాగర్ : గత మూడు రోజులుగా జరుగుతున్న సాగర్‌మాత మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ముగింపు సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్యకు భక్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్న పీఠాధిపతులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి గుడి వద్దకు తీసుకువచ్చారు. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు గురుశ్రీ చాట్ల కస్సార్‌చే దివ్యబలిపూజ, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల గురుశ్రీ మర్రి అనిల్ దివ్యబలిపూజ, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు గురుశ్రీ మార్నేని దిలీప్‌చే దివ్యబలిపూజ, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డిచే దివ్యబలిపూజ, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్యచే సమిష్టి దివ్య పూజ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గురవరేణ్యులు గురుశ్రీ పామిశెట్టి తోమస్ బృందంచే గానం, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 3గంటలకు కోలాటం, సాయంత్రం 6గంటలకు సాగర్‌మాత రథోత్సవం నిర్వహించారు.
పురవీధుల్లో రఽథోత్సవం
సాయంత్రం పురవీధుల్లో సాగర్‌మాత రథోత్సవాన్ని నిర్వహించారు. సాగర్‌మాత దేవాలయం, అంబేద్కర్ సెంటర్, పార్క్ సెంటర్ వద్ద పాము, చెట్టు రూపాల్లో తయారు చేసి కాల్చిన బాణా సంచా పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఫాదర్స్ జోసఫ్‌బాలసాగర్, ఫాదర్ తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, ఇన్నారెడ్డి, శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment