ఫ రూ. 1.81 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం
ఫ నెలాఖరు వరకు యూనిట్ల గ్రౌండింగ్‌కు ఆదేశం
ఫ హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం
నల్లగొండ అగ్రికల్చర్: గత ప్రభుత్వ హయాంలో 2018 సంవత్సరంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలు ఇచ్చేందుకు జిల్లాకు 2024 సంవత్సరానికి గాను రూ.1,81,36,000 నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే పథకం అమలు కోసం విధివిధానాలు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లాలకు పంపించారు. ఏడేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయితే ప్రభుత్వం తిరిగి సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడానికి యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 820 యూనిట్లు అందించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో పనిముట్ల పంపిణీకి జిల్లా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలను ముమ్మరం చేసింది.
నెలాఖరు వరకు గ్రౌండింగ్
యాత్రీకరణ పథకాన్ని పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంట్లోభాగంగా పాటుగా ఈనెలాఖరు వరకు కచ్చితంగా యూనిట్లను రైతులకు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి మండలాల వారీగా యూనిట్ల పంపిణీతో పాటు అర్హుల జాబితాను నివేదించేందుకు కసరత్తు ప్రారంభించారు. అనంతరం ఈనెల 31లోపు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయనున్నారు
మండలాల వారీగా పరికరాలు కేటాయిస్తాం
నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ అనుమతితో మండలాల వారీగా పరికరాల సంఖ్యను కేటాయించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తాం.
పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ
సాగు యాంత్రీకరణ.. పునరుద్ధ్దరణ