నల్లగొండ: పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తిరిగి ఏప్రిల్ 4వ తేదీన ముగియనున్నాయి. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 18,825 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు 5 నిమిషాల సడలింపు అవకాశం కల్పించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఈఓ భిక్షపతి తెలిపారు.
ఫ పరీక్ష రాయనున్న 18,825 మంది